‘మరణానికి ముందు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్.. 7 ఏళ్ల కుమారుడి గురించి గుండె పగిలేలా’
మ్యూజిక్ సెన్సేషన్ లియామ్ పేన్ ఆకస్మిక మరణం సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టింది. అర్జెంటీనాలోని బ్యునస్ ఎయిర్ నగరంలోని ఓ హోటల్‌లో బస చేసిన ఆయన మూడో ఫ్లోర్ నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు తీవ్ర విషాదంతో శ్రద్దాంజలి ఘటిస్తు్న్నారు. అయితే లియామ్ పేన్ చివరి సారిగా తన 7 ఏళ్ల కుమారుడికి చేసిన పోస్టు అందర్నీ కంటతడి పెట్టేలా చేస్తున్నది. సంగీత ప్రపంచంలో యువ కెరటం గురించిన వివరాల్లోకి వెళితే..
మాజీ వన్ డైరెక్షన్ స్టార్ లియామ్ పేన్ మరణంపై కుటుంబం పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. లియామ్ మరణ వార్తతో మా గుండెలు ముక్కలయ్యాయి. మా గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతాడు. ఆయన మంచితనం, ఫన్నీ నేచర్, ధైర్యంగా నిలబడే మనస్తత్వం ఆయనలో గొప్ప లక్షణాలు. కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచేవాడు. ఎవరి ప్రైవసీకి భంగం కలిగించకుండా చర్యలు తీసుకోనే వారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

లియామ్ మరణం తర్వాత తన ఏకైకా కుమారుడు బియర్‌కు ఆగస్టు 31వ తేదీన స్నాప్‌చాట్‌లో పోస్టు చేసిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నా కొడుకు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకొంటున్నాను. అవి మీకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. నా కొడుకు పుట్టిన రోజు సందర్భంగా మీరు నా కొడుకును దీవించాలి అని తన వీడియోలో చెప్పడం కనిపించింది.

నా కొడుకు బియర్ ఇప్పుడు చిన్న పిల్లాడు కాదు. చాలా పెద్దగా అయ్యాడు. నా చిన్నతనంలో నేను ఎలా ఉండేవాడినో అలానే ఉన్నాడు. నా కొడుకులో చిన్నప్పటి నన్ను చూసుకొంటున్నాను. నా కొడుకు కంటే మరో ప్రపంచం ఏదీ లేదు. నా కొడుకులో చాలా ప్రతిభను గుర్తించాను. తండ్రి దీవెనలు ఎప్పడూ ఉంటాయి అని లియామ్ వీడియోలో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

అయితే తన కుమారుడి ఫోటోను షేర్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. తన మ్యూజిక్ పార్ట్‌నర్ చెరీల్‌ను తన కుమారుడి ఫోటోను పబ్లిక్‌కు రివీల్ చేయకూడదని వేడుకొన్నాడు. తనకు కొడుకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం అని ఆయన సన్నిహితులు వెల్లడించారు. తమ స్నేహితుడు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారు తెలిపారు.


Click it and Unblock the Notifications











