‘లవ్ స్టోరీ’ నుంచి నాలుగో పాట విడుదల: ఆకట్టుకుంటోన్న ‘ఏవో ఏవో కలలే’ రెయిన్ సాంగ్

విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సహజ సిద్దమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ సక్సెస్ అవుతోన్న ఆయన.. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రమే 'లవ్ స్టోరీ'. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగనే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు.

ఇప్పటికే 'లవ్ స్టోరీ' మూవీ నుంచి మూడు పాటలు విడుదల అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా 'ఏవో ఏవో కలలే' అని సాగే రెయిన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. భాస్కర భట్ల రాసిన ఈ పాటను జోనితా గాంధీ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చాడు. మనసుకు హత్తుకునే మెలోడీ ట్యూన్‌తో సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక, ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇది సినిమాలో మాంచి డ్యాన్స్ నెంబర్ సాంగ్ అవుతుందని లిరికల్ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

Love Story Evo Evo Kalale Song Released

'లవ్ స్టోరీ'లోని ఈ పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేసిన అతడు.. 'లవ్ స్టోరీ మూవీలోని ఏవో ఏవో కలలే సాంగ్ విడుదల చేస్తునందుకు సంతోషంగా ఉంది. నారాయణ దాస్ గారితో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్' అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X