For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Saranga Dariya​ Video Song: ‘లవ్ స్టోరీ’ నుంచి అదిరిపోయే కానుక.. అప్పుడే అన్ని లక్షల వ్యూస్

  |

  అక్కినేని నాగ చైతన్య.. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఫీల్ గుడ్ మూవీ 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. కానీ, కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో దీన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా అదిరిపోయేలా వచ్చాయి. ఫలితంగా నిర్మాతలకు లాభాలు కూడా దక్కాయి.

  Bigg Boss: ఆరో వారం సంచలన ఎలిమినేషన్.. డేంజర్‌ జోన్‌లో టాప్ కంటెస్టెంట్లు.. ఆ నలుగురిలో ఒకరు ఔట్

  సున్నితమైన ప్రేమకథతో రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీ ప్రమోషన్‌లో భాగంగానే పలు రకాల పోస్టర్లు, టీజర్, పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇందులోని 'సారంగ దరియా' అంటూ సాగే ఓ ఫోక్ సాంగ్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ పాట యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అద్భుతమైన పాట 340 మిలియన్ వ్యూస్‌ మైలురాయిని చేరుకుని ఓ ఘనతను కూడా అందుకుంది. ఫలితంగా దీని పేరు మీద ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి.

   Love Story Movie Saranga Dariya Video Song Released

  'సారంగ దరియా' పాటకు సినిమా థియేటర్లలో సైతం అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ పాట వస్తోన్న సమయంలో ప్రేక్షకుల కరతాళధ్వనులతో సినిమా హాళ్లు మోతమోగిపోయాయి. అంతలా ఇది అందరినీ హత్తుకుందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'లవ్ స్టోరీ' మూవీ నుంచి ఈ పాటకు సంబంధించిన వీడియో (Saranga Dariya​ Video Song)‌ను విడుదల చేశారు. దీనికి కూడా లిరికల్ వీడియో మాదిరిగానే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కేవలం నాలుగు గంటల్లోనే ఈ పాటకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే మరో గంట రెండు గంటల్లో ఇది మిలియన్ మార్కును చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

  'దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అంటూ సాగే ఫోక్ సాంగ్‌లో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. ఈ పిక్చరైజేషన్ కూడా సూపర్బ్‌గా ఉంది. అందుకే ఈ వీడియో సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇక, తెలంగాణ పల్లె పదాలతో రూపొందిన 'సారంగ దరియా' పాటను పవన్ సీహెచ్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించింది. అలాగే, సుద్దాల అశోక్ తేజ దీనికి లిరిక్స్ అందించారు. ఈ పాట వల్లే 'లవ్ స్టోరీ' సినిమాను చూసిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారనడంలో సందేహమే లేదు.

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'లవ్ స్టోరీ'లో మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దసరా పండుగ నాడు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. Now Saranga Dariya Video Song Released From This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X