నేను బతికే ఉన్నా.. చనిపోలేదు.. ప్రముఖ సంగీత దర్శకుడు క్లారిటీ
ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు లక్కీ ఆలీ మరణించారనే వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. అయితే ఆ వార్త నిజం కాకూడదనే భావించిన అభిమానులందరికీ సంతోషం కలిగించే విషయం మరోటి వెలుగులోకి వచ్చింది. లక్కీ ఆలీ బతికే ఉన్నారంటూ ప్రముఖ నటి నఫీసా ఆలీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు నుంచి లక్కీ ఆలీ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఆయన బతికే ఉన్నారని స్పష్టం చేశారు.
లక్కీ ఆలీ ఆరోగ్యం గురించి నఫీసా ఆలీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతీ రోజు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. తన ఫ్యామిలీతో కలిసి ఫాంహౌస్‌లో ఉన్నారు. ఆయన కరోనావైరస్ బారిన పడలేదు. ఆరోగ్యంతో ఉన్నారు అని తెలిపారు.

బుధవారం కూడా మూడుసార్లు మాట్లాడాను. ఆయనలో యాంటీబాడీస్ ఎక్కువగానే ఉన్నాయి. మ్యూజిక్, సంగీత కచేరీల గురించి ప్లాన్ చేసుకొంటున్నారు. బెంగళూరుకు సమీపంలోని ఫాంహౌస్‌లో ఉన్నారు. యువ సంగీతకారులను ప్రోత్సహించేందుకు కచేరీలు ప్లాన్ చేస్తున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











