కరెన్సీ దేవీ వరించేలా.. కాలర్ ఎగరేసి తిరగరా.. వైరల్‌గా లక్కీ భాస్కర్ టైటిల్ సాంగ్
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్, యువ హీరోయిన్ మీనాక్షి ఛౌదరీ తదితరులు నటించారు.
వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పాట వివరాల్లోకి వెళితే.. లక్కీ భాస్కర్ టైటిల్ పాట మంచి బీట్‌తో మొదలై..

శభాష్ సోదరా..
కాలర్ ఎత్తి తిరగరా..
కరెన్సీ దేవీ నిన్ను వరించెరా!
తమాషా చూడగరా..
నీ గ్రహలు సరసరా..
అదృష్ట రేఖపైనే కదిలేరా!
నిన్నాపేవాడే లేడే
నీదైనా కాలం.. నీదే మొదలురా
మొదలురా..
యూ లక్కీ భాస్కర్..
యూ లక్కీ భాస్కర్
యూ లక్కీ భాస్కర్..
యూ లక్కీ భాస్కర్
శక్తి నీదిరా
యుక్తి నీదిరా
కోటీ విద్యాలేమైనా..
కూటి కోసమేరా.
లెగరా.. నడవరా..
మెదడుకే పదును పెట్టారా?
దిగర దేవరా
లాకర్లు కొల్లగొట్టారా
ఎగుడు దిగుడుగా
ఇన్నాళ్ల రొస్టు చాలురా అంటూ సాగే పాట.. లక్కీ భాస్కర్‌ను ఉద్దేశించి రాసిన పాటగా స్పష్టమైంది. హుషారెత్తించే బీట్‌కు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సాటను ప్రముఖ గాయని ఉషా ఉతప్ పాడారు. జీవీ ప్రకాశ్ కంపోజ్ చేశారు. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ కంపెనీ మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు.
యూత్‌కు కిక్కించే టార్గెట్‌గా రాసిన రామజోగయ్య శాస్త్రీ రాసిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. టైటిల్ సాంగ్స్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా వచ్చాయి. వాటిలో ఈ పాట సాహిత్యపరంగా, మ్యూజిక్ పరంగా మంచి ప్రమాణాలతో సాగింది.


Click it and Unblock the Notifications











