Lucky Baskhar Music Review దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి టాప్ క్లాస్ రొమాన్స్.. శ్రీమతి గారు పాట విన్నారా? చూశా
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ పాటల వివరాల్లోకి వెళితే..
లవ్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన శ్రీమతి గారు అనే పాటను ఇటీవల యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయగా మంచి స్పందన కూడా గట్టుకొంటున్నది.
కోపాలు చాలండీ శ్రీమతి గారు..
కొంచెం కూలవ్వండి మేడమ్ గారు..
చామంతి నవ్వే విసిరే మీరు..
కసరినేస్తూ ఉన్న బాగున్నారు..
సరదాగా సాగే సమయంలోనా
మరచిపోతే.. బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు
కోపాలు చాలండీ శ్రీమతి గారు..
కొంచెం కూలవ్వండి మేడమ్ గారు..

పలుకే నీది ఓ వెన్నెపూస
అలకే ఆపే మనసా
మౌనం తోడి..మాటాడే భాష
అంటే నీకే అలుసా
ఈ అలల గట్టు
ఆ పూల చెట్టు
నిను చల్లబడవే అంటున్నాయే..
ఏం జరగనట్టు..నీవు కరగినట్టు
నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి

సరసాలు చాలు శ్రీవారు..
ఆఖరికి నెగ్గేది మీ మగవారు.. అంటూ రొమాంటిక్‌గా సాగిన ఈ పాటను దుల్కర్, మీనాక్షి చౌదరీపై చిత్రీకరించారు.
వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని ఈ పాటకు సాహిత్యం శ్రీమణి రాయగా, విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. గత నాలుగు రోజుల్లోనే ఈ పాట 3 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











