ఆకట్టుకున్న రాజశేఖర్ కూతురు.. 'దొరసాని'కి బ్రేక్ వచ్చినట్లేనా?
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'దొరసాని'. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టున్నాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రంలోని ''కళ్ళల్లో కలవరమై..'' సాంగ్ రిలీజ్ చేశారు.

రేడియో మిర్చి ఎఫ్ఎం ద్వారా హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మిక చేతుల మీదుగా ఈ పాట విడుదల చేశారు. 'కళ్ళల్లో కలవరమై.. కలవరమై' అంటూ సాగిపోతున్న ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. శ్రేష్ఠా అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సూపర్బ్ ఫీలింగ్ తీసుకొస్తోంది. ఇక ఇందులూ శివాత్మిక లుక్స్ చూస్తుంటే సీనియర్ హీరోయిన్‌ని మించి నటనా ప్రతిభ కనబర్చిందని తెలుస్తోంది. శివాత్మికకు 'దొరసాని' మొదటి సినిమానే అయినా మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.
1980 కాలంనాటి పరిస్థితుల నేపథ్యంలో దొరసాని సినిమా తెరకెక్కుతోంది. ఎక్కువ భాగం వరంగల్ ఖిలాలో షూట్ చేశారు. అక్కడి చారిత్రక ప్రదేశాలు చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ అవుతాయని తెలుస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమా జులై 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ కథాంశం కావడం, రాజశేఖర్ కూతురి ఎంట్రీ.. అదేవిధంగా విజయ్ దేవరకొండ తమ్ముడి మొదటి సినిమా కావడం లాంటి అంశాలు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











