'వాట్ ది ఎఫ్' సాంగ్ కాంట్రవర్సీ.. లిరిసిస్ట్ శ్రీమణి స్పందన!
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గీత గోవిందం. ఇటీవల ఈ చిత్రంలోని వాట్ ది ఎఫ్ అనే సాంగ్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని లిరిక్స్ అభ్యంతరకంగా ఉన్నాయని విమర్శలు రావడంతో ఈ పాటని చిత్ర యూనిట్ యూట్యూబ్ నుంచి తొలగించింది. ఈ వివాదంపై పాట రచయిత శ్రీమణి స్పందించారు.
ఈ పాటలోని కొన్ని వ్యాఖ్యలు మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఎవరి మనో భావాలని కించపరచడం మా ఉద్దేశం కాదు అని శ్రీమణి తెలిపారు. మనోభావాలకు అనుగుణంగా మెలగడం కూడా మా కర్తవ్యం. కనుక పాటలోని అభ్యంతరకర పదాల్ని తొలగించి మార్పులు చేస్తున్నాం. ఆ తరువాత పాటని తిరిగి అప్ లోడ్ చేస్తామని తెలిపారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
More from Filmibeat
allu arjun vijay devarakonda geetha arts parasuram rashmika mandanna విజయ్ దేవరకొండ గీత ఆర్ట్స్ పరశురామ్


Click it and Unblock the Notifications











