మన్మథుడు 2: మా చక్కని పెళ్లంట.. ముచ్చటైన జంట

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' మూవీ తెరకెక్కుతోంది. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మేరకు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర యూనిట్ తాజాగా మన్మథుడు 2 సినిమాలోని ''మా చక్కని పెళ్లంట.. ముచ్చటైన జంట'' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఇంట్లో పెళ్లి వాతావరణం, సందడి సందడిగా కుటుంబమంతా కలిసి పెళ్లి వేడుకను ఎంజాయ్ చేసే సన్నివేశాలతో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన బాణీల్లో కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం కొత్తగా అనిపిస్తున్నాయి. అనురాగ్ కులకర్ణి, చిన్మయి, దీప్తి పార్థసారథి ఆలాపన ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్.

Maa Chakkani Pellanta Lyrical song From Nagarjunas Manmadhudu 2

ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ మన్మథుడు 2 రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందనేది తెలపగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ లెక్కన యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఆడియన్స్‌ని అలరించేలా మన్మథుడు 2 రూపొందించారని అర్థమవుతోంది. ఆరు పదుల వయసులో కూడా నాగార్జున లుక్ ఈ సినిమాలో హైలైట్ కానుంది. గతంలో వచ్చిన మన్మథుడు సినిమాలో ఆడవాళ్లంటే విసిగించుకునే నాగార్జునను చూశాం.. ఇప్పుడు మన్మథుడు 2 లో ఆడవాళ్లంటే ఇష్టపడే మన్మథుడిని చూడబోతున్నాం అని అంటోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X