‘మహర్షి’ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది: దేవిశ్రీ అదరగొట్టారు...

Recommended Video

Choti Choti Baatein Lyrical Song From Maharshi Movie Team Released || Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' మూవీ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ 'చోటి చోటి బాతే' సాంగ్ విడుదలైంది. ఈ పాట ద్వారా మూవీ ప్రమెషన్స్ ప్రారంభించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'చోటి చోటి బాతే' అనే సాంగ్ మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ మీద చిత్రీకరించారు. ఈ ముగ్గురి మధ్య సాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాంగ్ సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఫీల్ గుడ్ అనేలా ఉంది. శ్రీమణి లిరిక్స్ బావున్నాయి.

చోటి చోటి బాతే సాంగ్...

స్నేహానికి సంబంధించిన అంశాలతో పాటను డిజైన్ చేశఆరు. ‘చోటి చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే... మీటి మిటి మీటి మీటి మీటి మీటి యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలలే... ఎన్నో వేల కథలు.. ఇంకో కథ మొదలు' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

కీలక పాత్రలో నరేష్

కీలక పాత్రలో నరేష్

ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. నరేష్ పోషిస్తున్న పాత్ర మరణం తర్వాత కథలో ఊహించని మలుపు తిరుగుతుందని, సినిమాలో మెయిట్ ట్విస్ట్ అదే అని టాక్. తన స్నేహితుడిని కోల్పోయిన తర్వాత ఆ ప్రభావం మహేష్ బాబు మీద తీవ్రంగా పడుతుందని... తన జీవితాన్ని మార్చుకోవడంతో పాటు సొసైటీలో కూడా మార్పు తేవాలని డిసైడ్ అవుతారని, ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అశ్వినీ దత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మే 9న రిలీజ్

మే 9న రిలీజ్

‘మహర్షి' చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భారీ కలెక్షన్లు సాధించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X