బిజీబిజీగా మహేష్, త్రివిక్రమ్ జూమ్ చర్చలు.. అప్పుడే మ్యూజిక్ వరకు వచ్చేశారు
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సినిమాల అనంతరం వీరి కలయికలో వస్తున్న మూడవ సినిమా కావడంతో అంచనాలు. ఒక్కసారిగా పెరిగిపోయాయి. SSMB28వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31 న స్పెషల్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎక్కువ చర్చ మొత్తం కూడా జూమ్ కాల్స్ లోనే జారుగుతోందట. మహేష్ బాబు - త్రివిక్రమ్ ఇద్దరు కూడా వీడియో కాల్స్ లో రోజు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ అప్పుడే మ్యూజిక్ కంపోజిగ్స్ వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు ముందునుంచే టాక్ వస్తోంది. థమన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఎనౌన్స్మెంట్ రోజు మాత్రం వీడియోలో థమన్ పేరును ఎందుకు వేయలేదో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఫైనల్ గా థమన్ తోనే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి సాంగ్స్ కంపోజింగ్స్ పనులను కూడా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానులను ఎంతవరకు. ఆకట్టుకుంటోంది చూడాలి.


Click it and Unblock the Notifications











