Guntur Kaaram: ఘాటెక్కించిన గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమో.. మరి పాట వచ్చేది ఎప్పుడంటే?

Guntur Kaaram First Song Promo: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించబోతుంది. అయితే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. దీపావళి పండుగకు కచ్చితంగా ఏదో ఒక అప్ డేట్ ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ భావించగా.. నిరాశే ఎదురైంది. కానీ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లీక్ అవడంతో.. అప్రమత్తమైన చిత్రబృందం సాంగ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది.

ఈక్రమంలోనే ఈరోజు తాజాగా గుంటూరు కారంలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఆదివారం 11.07 గంటలకు ప్రోమోను విడుదల చేయగా... పూర్తి పాటను ఏరోజు విడుదల చేయబోతుందో కూడా ప్రోమో చివర్ లో చెప్పేసింది. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ.. అంటూ పాటు ప్రారంభం కాగా.. జీపులో మహేష్ బాబు వెళ్లడం చూపిస్తారు. ఎగబడి ముందరకే వెళిపోతాది నేనెక్కిన నుండి అంటూ పాట వస్తుండగా.. మహేష్ బాబు కారు దిగుతూ కనిపించాడు. ఇక ఆ తర్వాత వచ్చే దం మసాలా బిర్యానీ.. కుర్రకారు అరకొడే, నిమ్మసోడా ఫుల్ బీడీ.. అత్తికారై కొంటోందే అంటూ సాగే పాట అద్భుతంగా ఉంది.

Mahesh Babu Guntur Kaaram First Single Promo Outnow

ఇందులో మహేష్ బాబా ఓ ఇంట్లోకి వస్తూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే పాట పూర్తవుతుండగా... మూవీ టైటిల్ వేశారు. ఆ తర్వాత మిరపకాయలు గాల్లో ఎగురుతుండగా.. మహేష్ బాబు కుర్చీపై కూర్చొని బీడీ తాగుతూ కనిపించాడు. ఈక్రమంలోనే గుంటూరు కారంలో సినిమాలోని మొదటి పాటను నవంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రోమో చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సాంగ్ కూడా త్వరగా వస్తే బాగుండని అంటున్నారు. పాటే ఈ రేంజ్ లో ఉందంటే.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Mahesh Babu Guntur Kaaram First Single Promo Outnow

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో పదమూడేళ్ల తర్వాత రాబోతున్న మూడో చిత్రం ఇది. ముందు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి బాక్సాఫీసులను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంత కాలం తర్వాత వీరి కాంబోలో రాబోతున్న గుంటూరు కారం చిత్రం కూడా అదే రేంజ్ లో అదరగొడుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బయటకు వచ్చినా క్షణాల్లోనే వైర్ అవుతోంది. మీరూ ఓసారి ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోనూ చూసి ఎంజాయ్ చేయండి.

తమన్ సంగీతం అందిస్తున్న మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాన్ని హీరిక, హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జయం రవి, మీనాక్షి చౌదరి, సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణలు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టి ఎంత మేర కెలక్షన్లను వసూలు చేస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X