Guntur Kaaram దమ్ మసాలా ట్రెండింగ్ నంబర్ 1.. గుంటూరు కారం సాంగ్‌కు రికార్డు వ్యూస్!

Dum Masala Biryani Song: 13 సంవత్సరాలు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబోలో ఈ చిత్రం వస్తుందని తెలిసినప్పటి నుంచే ఓవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, మరోవైపు త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. చిన్న అప్ డేట్ ను కూడా తెలుసుకుంటూ సినిమా అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుందంటూ ఊహించుకుంటున్నారు.

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక, హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జయం రవి, సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణలు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

Mahesh Babu Guntur Kaaram First Song Dum Masala Biryani Youtube Number One Trending

అయితే తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన మొదటి పాటను నవంబర్ 7వ తేదీన చిత్రబృందం విడుదల చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా దమ్ మసాలా బిర్యానీ పాటను రిలీజ్ చేసింది. తాజాగా విడుదల అయిన ఈ పాట అద్భుతంగా ఉంది. పాటలోని లిరిక్స్ తో పాటు మహేష్ బాబు మాస్ మసాలా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కాసేపట్లోనే నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.

Mahesh Babu Guntur Kaaram First Song Dum Masala Biryani Youtube Number One Trending

ముఖ్యంగా దమ్ మసాలా బిర్యానీ పాట లిరిక్స్ అయితే హైలెట్ గా నిలుస్తున్నాయి. అలాగే మహేష్ బాబు లుక్ కూడా రివీల్ అవ్వడం, చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే.. మిల్క్ బాయ్ బీడీ తాగడం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. దమ్ మసాలా బిర్యానీ పాటను సంజిత్ హెగ్డే, తమన్ లు కలిసి పాడారు. వీరిద్దరూ కలిసి పాడిన ఈ పాటలో మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగానే తమన్ మ్యూజిక్ తో మేజిక్ చేశాడు. ముఖ్యంగా దమ్ మసాలా బిర్యానీ, ఎర్రకారం అరకోడి, నిమ్మసోడా ఫుల్ బీడీ.. గుద్ది పారెయ్ గుంటూర్ ని అంటూ వచ్చినప్పుడు మాత్రం బీట్ అదిరిపోయింది.

దమ్ మసాలా పాట అద్భుతమైన రికార్డు

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఈ పాట యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. ఈ పాట విడుదల అయిన 24 గంటల్లోపే 19.2 ప్లస్ మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అలాగే టాలీవుడ్ మోస్ట్ వ్యూయిడ్ సాంగ్ ఇన్ 24 హవర్స్ రికార్డును కూడా సాధించింది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్ గానే కొనసాగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో మరింత ఎక్కువ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X