Guntur Kaaram First Song: దమ్ మసాలతో అదరగొట్టిన మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కు ముందే వచ్చిన దీపావళీ!
Dum Masala Biryani Song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా ఈరోజు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేసిన మూవీ టీం.. ఈరోజు దమ్ మసాలా బిర్యానీ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. తాజాగా విడుదల అయిన ఈ పాట అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఇందులో మహేష్ బాబు లుక్ మామూలుగా లేదు. మిల్క్ బాయ్ మాస్ స్టైల్ చూస్తే అంతా ఫిదా అయిపోతారు. బీడీ కాల్చే విధానం, చూపించే హీరోయిజం నిజంగా అదిరిపోయింది.

గుంటూరు కారం సినిమాలో ఫస్ట్ లిరికల్ సాంగ్ తో పాటు మహేష్ బాబు లుక్ కూడా రివీల్ చేయడంతో ఆయన అభిమానులు అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ పాటకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. దమ్ మసాలా బిర్యానీ పాటను సంజిత్ హెగ్డే, తమన్ లు కలిసి పాడారు. వీరిద్దరూ పోటాపోటీగా పాడిన ఈ పాటలో.... మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగానే తమన్ మ్యూజిక్ తో మేజిక్ చేశాడు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా దమ్ మసాలా బిర్యానీ, ఎర్రకారం అరకోడి, నిమ్మసోడా ఫుల్ బీడీ.. గుద్ది పారెయ్ గుంటూర్ ని అంటూ వచ్చినప్పుడు మాత్రం బీట్ అదిరిపోయింది.

ఈ పాట విన్న, చూసిన ప్రతీ ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాటనే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉందోనని వివరిస్తున్నారు. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జయం రవి, మీనాక్షి చౌదరి, సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణలు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న మూడో చిత్రం ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ కాంబో మరోసారి బాక్సాఫీసను బద్ధలు కొట్టేందుకు వస్తుంది. అయితే ఇంత కాలం తర్వాత వీరి కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టు అవుతుందని కోట్లలో కలెక్షన్లు వసూలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











