ప్రదీప్ 30 రోజుల ప్రేమ.. మహేష్ బాబు సాయం
బుల్లితెర టాలెంటెడ్ యాంకర్ ప్రదీప్ ఇకపై వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే సినిమా సెట్స్ పై చురుకుగా కదులుతున్నాడు. ఈ సినిమాకు మొదటగానే రానా సపోర్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగానే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ల కాన్సెప్టు, సంగీతం తనకు బాగా నచ్చినది తెలిపిన రానా.. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఇప్పుడు ఇదే సినిమాకు మహేష్ బాబు సపోర్ట్ కూడా లభించింది. ఈ చిత్రం నుండి 'నీలి నీలి ఆకాశం' ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు సూపర్ స్టార్. 'నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్న.. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా.. నెలవంకను ఇద్దామనుకున్నా.. ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే..' అంటూ సాగే ఈ పాటకు చంద్ర బోస్ లిరిక్స్ అందించగా.. సిద్ శ్రీరామ్ సునీత ఈ పాటను చక్కగా పాడారు. అనూప్ రూబెన్స్ బాణీలు కట్టారు.

ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











