మహేష్ బాబు మైండ్ బ్లాక్ రికార్డ్.. సూపర్ స్టార్ కెరీర్ లోనే నెంబర్ వన్ సాంగ్!
గత ఏడాది భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు మ్యూజిక్ కూడా ఏ రేంజ్ లో హెల్ప్ అయ్యిందో అందరికి తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన విధానం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది.
ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ అన్ని వర్గాల అడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సాంగ్స్ చేసినా కూడా అడియెన్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేస్తాడు. అలాగే హీరోల స్టైల్ కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇవ్వడం వెన్నతో పెట్టిన విద్య. ఇక మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ ఇటీవల ఒక సరికొత్త రికార్డును అందుకుంది.

ఆ వీడియో సాంగ్ ఏకంగా 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు కెరీర్ లో 100మిలియన్ వ్యూవ్స్ అందుకున్న వీడియో సాంగ్ ఇదే కావడం విశేషం. పాటకు తగ్గట్లుగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. మెయిన్ గా మహేష్ బాబు లుంగీతో డ్యాన్స్ వేయడం అభిమానుల చేత విజిల్స్ వేయించింది. సోషల్ మీడియాలో ట్యాగ్స్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లో మంచి లాభాలు అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను F2 అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











