‘మహేశ్ బాబు అప్పటి నుంచి ముఖం చాటేశారు. ఆ ఇద్దరికే ఆఫర్లా?’
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్‌ను హీరోలు, హీరోయిన్లు, నిర్మాత, దర్శకులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా కాంబినేషన్లను ఇంకా బలంగా విశ్వసిస్తారు. ఒక సినిమా హిట్ అయితే అదే టీమ్‌ను దాదాపు కొనసాగిస్తారు. ఒకవేళ ఫ్లాప్ అయితే వారిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెడుతారు. ఇలాంటి సందర్భాలను ఎన్నో చూసి ఉన్నాం. తాజాగా తనను మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
మహేష్ బాబు నాకు చిన్న తమ్ముడి లాంటి వారు. తన కెరీర్ ఆరంభంలో నన్ను బాగా నమ్మేవారు. ఆయన నమ్మకాన్ని ఎప్పడూ కాపాడుకొనే వాడిని. మేము కలిసి చేసిన చివరి సినిమా వరకు నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టాను. ఏమైందో ఏమో కానీ.. చాలా రోజులుగా, మేము కలిసి పనిచేసిన చివరి సినిమా తర్వాత నాకు ముఖం చాటేశాడు అని మణిశర్మ అన్నారు.

ఇక నేను ఇష్టపడే హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఖుషి సినిమాలో చెలియ చెలియా అనే పాటను ఇద్దరం కలిసి కంపోజ్ చేశాం. అలాగే గుడంబా శంకర్ సినిమాలో కూడా పాటలు కంపోజ్ చేశాం. ఇద్దరం కలిసి పాటలు పాడుతూ.. డ్యాన్పులు చేస్తూ రికార్డింగ్ స్టూడియోలో ఎంజాయ్ చేసే వాళ్లం అని మణిశర్మ అన్నారు.
అయితే కొంతకాలంగా మహేష్, పవన్ కల్యాణ్ నన్ను దూరంగా పెట్టారు. వారి సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశాలు ఇవ్వడం లేదు. అది నాకు కొంత బాధగా ఉంది. వారితో కలిసి పనిచేయాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని మణిశర్మ చెప్పారు.

ఇక మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి సినిమాకు రొటేట్ చేయాలి. కేవలం దేవీ శ్రీ ప్రసాద్, థమన్ లాంటి వాళ్లకే అవకాశాలు ఇస్తూ పోతున్నారు. మా లాంటి వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అంటూ మణిశర్మ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











