పవన్ కళ్యాణ్ రికార్డు 23 గంటల్లోనే బద్దలు కొట్టిన మహేష్.. మాములుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగితే రికార్డులన్నీ తారుమారు కావాల్సిందే. గతంలో అనేక రికార్డులను తన పేరున సృష్టించుకున్న మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట మొదటి సాంగ్ 'కళావతి' తోరికార్డులను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కళావతి సాంగ్ అనేక రికార్డులు బద్దలు కొడుతూ మొదటి స్థానంలోకి వచ్చి చేరింది. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ ఫ్రెండ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదల కూడా కావాల్సి ఉంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుంది అనుకుంటే ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకుంటే మే నెలకు వాయిదా వేశారు.

కొత్త రికార్డులు
ఇంకా షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉన్న ఆ సినిమా విడుదల తేదీ అయితే ప్రకటించారు. దీంతో సర్కారు వారి పాట సినిమా యూనిట్ నుంచి అనేక అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'కళావతి' అనే ఒక సాంగ్ విడుదల చేయడానికి సర్కారు వారి పాట యూనిట్ సిద్ధమైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి 'కళావతి' అనే సాంగ్ ప్రోమోని 11వ తేదీ ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ కొత్త రికార్డులు సృష్టించింది.

భీమ్లా నాయక్ రికార్డులు బద్దలు
సాంగ్ విడుదలైన 23 గంటలలోనే ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాలీవుడ్ సాంగ్ ప్రోమోగా రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు 4.6 మిలియన్ వ్యూస్ ఉండగా ఇప్పుడు కళావతి సాంగ్ కి 5.4 మిలియన్ వ్యూస్ దక్కాయి. అలాగే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు 424 K లైట్స్ ఉండగా కళావతి సాంగ్ కి కేవలం ఇరవై మూడు గంటల్లోనే 425 K లైక్స్ దక్కాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రికార్డులను సర్కారు వారి పాట బద్దలు కొట్టినట్లు అయింది.

రంగం సిద్ధం
సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేయడం కోసం మహేష్ బాబు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి మే నెలలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు.

భారీ అంచనాలు
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమా గ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే జరగబోతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా తరువాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











