twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి మరో సెన్సేషన్.. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’ అంటున్న మహేష్

    |

    Recommended Video

    Maharshi Second Single ‘Nuvve Samastham’ Released || Filmibeat Telugu

    సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రెండో సింగిల్‌ను రిలీజ్ చేశారు. అదేలా ఉందంటే..

    మహర్షి సెకండ్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్

    మహర్షి సెకండ్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్

    మహర్షి సింగిల్స్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఇంతకుముందే విడుదైలెన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే' యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న ‘మహర్షి' చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.

    ఆకట్టుకునేలా నువ్వే సమస్తం.. నువ్వే సిద్దాంతం

    ఆకట్టుకునేలా నువ్వే సమస్తం.. నువ్వే సిద్దాంతం

    ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా... అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    మహర్షి టీజర్‌ దూకుడు

    మహర్షి టీజర్‌ దూకుడు

    మహర్షి చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 16,647,461 వ్యూస్ సాధించింది. సుమారు నాలుగు లక్షల లైక్స్ రావడం గమనార్హం.

    సాంకేతిక నిపుణులు

    సాంకేతిక నిపుణులు

    దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

    English summary
    Superstar Mahesh's upcoming film 'Maharshi' Directed by Superhit Films Director Vamshi Paidipally Produced by Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PvP Cinema is gearing up to release worldwide on May 9th. 'Maharshi' which marks 25th film of Superstar Mahesh is being made with super rich technical values. Pooja Hegde will be seen as heroine opposite Mahesh and Allari Naresh is doing a crucial role. Meanwhile Second Single from 'Maharshi' released on April 12. Second single which goes on with thoughtful lyrics, 'Nuvve Samastham..Nuvve Siddhantham, Nuvvele Nee Pantham..Nuvvele Anantham, Prathi Nisi Masai..Neelo Kase Disai..Adugesey Missailu laa...' depicts the aura of Rishi as winner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X