Don't Miss!
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహర్షి మరో సెన్సేషన్.. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’ అంటున్న మహేష్
Recommended Video
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రెండో సింగిల్‌ను రిలీజ్ చేశారు. అదేలా ఉందంటే..
మహర్షి సెకండ్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్
మహర్షి సింగిల్స్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఇంతకుముందే విడుదైలెన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే' యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న ‘మహర్షి' చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.
ఆకట్టుకునేలా నువ్వే సమస్తం.. నువ్వే సిద్దాంతం
‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా... అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మహర్షి టీజర్ దూకుడు
మహర్షి చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 16,647,461 వ్యూస్ సాధించింది. సుమారు నాలుగు లక్షల లైక్స్ రావడం గమనార్హం.
సాంకేతిక నిపుణులు
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.