twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్యుడివో చంద్రుడివో.. ఫ్యామిలీ టచ్ ఇచ్చిన ‘సరిలేరు’

    |

    భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్దమయ్యాడు. తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించే రేంజ్‌లో రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడితో చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఓ పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే మొదటి పాటను రిలీజ్ చేయగా.. నేడు రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

    ఏకిపారేసిన నెటిజన్లు..

    ఏకిపారేసిన నెటిజన్లు..

    మైండ్ బ్లాక్ అంటూ మాస్ బీట్‌ను విడుదల చేసిన చిత్రబృందం సగటు అభిమానిని కూడా నిరాశపరిచింది. పాట విడుదలకు ముందు మాస్ బీట్ అంటూ ఎంతో హల్ చల్ చేసిన చిత్రయూనిట్‌.. చివరకు చేదు అనుభవాన్ని చవిచూసింది. ఈ మధ్య కాలంలో ఈ పాటపై వచ్చినన్నీ ట్రోలింగ్స్ మరే సాంగ్‌పై రాలేదు. అన్ని పాటలను కలిపి కొట్టాడని దేవీ శ్రీ ప్రసాద్‌ను ఏకిపారేశారు.

    రెండో పాటను సిద్దం చేసిన యూనిట్..

    రెండో పాటను సిద్దం చేసిన యూనిట్..

    మొదటి పాట బెడిసి కొట్టడంతో రెండో పాటను ఫ్యామిలీ మూడ్, మెలోడిని దించారు. ఫస్ట్ సింగిల్‌తో అనుకున్నంత ఫేమ్ రాకపోయే సరికి అందరూ సంతృప్తి చెందేలా ఉండాలని కూల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నేటి సాయంత్రం 5.04గంటలకు సూర్యుడివో చంద్రుడివో అనే పాటను రిలీజ్ చేశారు.

    లిరిక్స్‌ను షేర్ చేసిన దర్శకుడు..

    ఈ పాట అదిరిపోనుందని, రామ జోగయ్య శాస్త్రి అదిరిపోయే సాహిత్యాన్ని అందించాడని పేర్కొన్నాడు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో... సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో... సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో..." అంటూ లిరిక్స్‌ను ముందే షేర్ చేశాడు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
     అదిరిపోయిన పాట..

    అదిరిపోయిన పాట..

    సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టర్‌ను, ఆ పాత్ర స్వభావం, కథను రివీల్ చేసేలా ఎంతో హృద్యంగా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. లెక్చరర్‌ భారతి పాత్రను పోషిస్తున్న విజయశాంతి ఫ్యామిలీకి సహాయం చేసేందుకు మహేష్ బాబు ఎంటర్ అయ్యే సందర్భంలో ఈ పాట వచ్చే అవకాశం ఉంది. ఈ పాటలో ముఖ్యంగా కేరళ అందాలను చూపించినట్టు కనిపిస్తోంది.

    English summary
    Mahesh Babu Sarileru Neekevvaru 2nd Single On 9th December. DSP sirrr thank you for the soothing tunes and ramjowrites gaaru your lyrics brought life to this song . This song Going to be DSP's one of the BEST . 2nd lyrical #SuryudivoChandrudivo will be live on tomorrow 5:04 PM
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X