Sarkaru Vaari Paata: కొనసాగుతున్న లీక్స్.. ఈసారి మొత్తం దించేశారు.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో బిజీగా ఉండగా ఎప్పటిలానే లీక్స్ కొనసాగుతూ ఉండడం విశేషం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒకరకంగా సినిమాకు సంబంధించిన కొన్ని లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మాస్ ఎలివేషన్స్
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. గీతగోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని ముఖ్యంగా మహేష్ అభిమానులు చొక్కాలు చించుకునేలా మాస్ ఎలివేషన్స్ ఉంటాయని కూడా వివరణ ఇచ్చారు.

ఆ పాటలకు మంచి రెస్పాన్స్
ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలతో కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసారు. సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన రెండు పాటలు కూడా కొన్ని వారాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే కళావతి పాట అలాగే పెన్ని సాంగ్.. రెండు కూడా మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాయి.

టైటిల్ సాంగ్ రెడీ
ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ పైనే ఉంది. ఈ పాటను 23వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు గా ఇటీవల అఫీషియల్గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరోసారి లీక్
అయితే లిరికల్ సాంగ్ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదివరకే ఒక పాట కూడా ఇదే తరహాలో లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ తీవ్ర స్థాయిలో అప్సెట్ అయ్యింది. ఒకసారి జరిగిన పొరపాటును మరొకసారి జరగనివ్వబోమని చిత్ర యూనిట్ సభ్యులు అప్పుడే క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్లీ అదే తరహాలో కంటిన్యూ కావడం విశేషం.

స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వింటే స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమని అర్థమవుతోంది. లీకైన సాంగ్ అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. తప్పకుండా ఒరిజినల్ సాంగ్ యూట్యూబ్లో కూడా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని కూడా అనిపిస్తోంది.
ఒక విధంగా మూడో పాట లీక్ అయిన ప్పటికీ కూడా మంచి హైప్ ఐతే క్రియేట్ చేస్తోంది. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఈసారి లీక్ పై మళ్ళీ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇక ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











