సర్కారు వారి పాట మరో ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజ్‌.. డేట్స్ ఫిక్స్ ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత వీలైనంత త్వరగా మరొక ప్రాజెక్టు ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్న మహేష్ బాబుకు అనుకోని విధంగా కరోనా వలన బ్రేక్ పడింది. ఇక తదుపరి సినిమా సర్కారు వారి పాటతో మరో మంచి విజయాన్ని అందుకోవాలని మహేష్ బాబు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల్లో కూడా సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నట్లు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త స్టైల్ తో దర్శనమిస్తున్నాడు.

నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ళ కుర్రాడు తరహాలోనే తో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విషయంలో మాత్రం చిత్రం యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. సర్కారు వారి పాట నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ త్వరలోనే మరొక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందం సినిమా అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. దర్శకుడు పరశురామ్ కూడా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలను చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా కనిపిస్తాడని ఒక అభిమాని సూపర్ స్టార్ ను ఎలాగైతే చూడాలని అనుకుంటున్నాను అలానే చూస్తారు అని అన్నారు.

Mahesh babu sarkaru vaari paata first single update release date fix

కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక మంచి సందేశం కూడా ఉంటుందని ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్క అంటూ ఓపెన్ గా వివరణ ఇచ్చారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే సినిమా కోసం మూడు పాటలను సిద్ధం చేసి ఉంచాడట. అందులో ఒక పాటను అక్టోబర్ 10 న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పాట ఎలా ఉంటుందనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

ఇక కీర్తి సురేష్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇదే మొదటి సినిమా కావడంతో ఇరు వర్గాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్ వెండితెరపై అద్భుతంగా ఉంటుందని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దేశంలోని ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఒక మంచి అంశాన్ని హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాంకు మోసాలపై కూడా కొన్ని నిజజీవిత సంఘటనలు కల్పితంగా చూపించబోతున్నరట. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి అక్రమాల గురించి కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X