Mahesh Babu ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త: థమన్ ట్వీట్‌తో దానిపై క్లారిటీ

కొంత కాలంగా వరుసగా హిట్ల మీద హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే దీన్ని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోంది.

బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారవుతోన్న బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు వింటేజ్ లుక్‌తో మాయ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించినా.. గత ఏడాది జనవరిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ దుబాయ్, హైదరాబాద్ నగరాల్లో పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరగడంతో సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.

Mahesh Babus Sarkaru Vaari Paata First Song On February 14th

'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు మాత్రం రావడం లేదు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా నుంచి 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌పై కోపంగా ఉన్నారు.

ఇక, 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన పాటలను ఈ జనవరి నుంచి వదులుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పలు డేట్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు కరోనా రావడంతో పాట విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే థమన్.. 'ఫిబ్రవరి 14న సాంగ్' అని ట్వీట్ చేశాడు. అది 'సర్కారు వారి పాట' నుంచి రాబోయే మొదటి పాటే అని తెలుస్తోంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Mahesh Babus Sarkaru Vaari Paata First Song On February 14th

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X