For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Penny Song: మహేష్ బాబుతో కలిసి మరో రికార్డును బ్రేక్ చేసిన థమన్.. టాలీవుడ్ నెంబర్ వన్!

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరకు గ్యాప్ ఇచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. కరోనా కారణంగా ఆయన తదుపరి సినిమా సర్కారు వారి పాట వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. స్పెషల్ పోస్టర్ విడుదలైనా, ఒక పాట విడుదలైన కూడా పాత రికార్డులను కూడా బ్రేక్ చేసే విధంగా ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోతున్నాయి.

  ఇక రీసెంట్ గా సినిమా నుంచి మరొక పాట విడుదలైన విషయం తెలిసిందే. కళావతి పాట సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూ ఉండగానే పెన్నీ అనే మరో పాటను విడుదల చేశారు. సర్కారు వారి పాట సినిమాలో ఒక బ్యాంక్ రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్న మహేష్ బాబు క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా ఈ పాటను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. తీసుకున్న అప్పును ఎలాగైనా వడ్డీతో సహా లాగే క్యారెక్టర్ లో మహేష్ కనిపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు పరశురామ్ ఈ పాత్రతో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు హై వోల్టేజ్ సన్నివేశాలను అలాగే చివర్లో మంచి సందేశాన్ని కూడా అందించబోతున్నారని తెలుస్తోంది.

  Mahesh babu Sarkaru vaari paata Penny song creates new record in tollywood

  దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు ఒక సినిమా నుంచి ఏం కోరుకుంటారో అలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని నిర్మాతలు కూడా ఇది వరకే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే పెన్నీ సాంగ్ ను మహేష్ బాబు క్యారెక్టర్ కు అద్దంపట్టేలాగా డిజైన్ చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లిరికల్ పాటలో మహేష్ కూతురు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడంతో జనాలు ఎగబడి చూశారు. ఇక అనంత శ్రీరామ్ రాసిన ఈ నకాశ్ అజీజ్ పాడారు. మొదట సంగీత దర్శకుడు తమన్ స్వర పరచిన కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  ఆ పాట కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 14.78 మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా ఇప్పుడు పెన్నీ వీడియో సాంగ్ ఇరవై రెండు గంటల్లోనే ఆ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 24 గంటల్లోపే అత్యధిక వ్యూవ్స్ అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ గా పెన్ని సాంగ్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం 16 మిలియన్ల వ్యూవ్స్ తో కొనసాగుతున్న పెన్నీ లిరికల్ సాంగ్ మహేష్ బాబు కెరీర్లో మరో బెస్ట్ సాంగ్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ ఇటీవల కాలంలో ఎలాంటి పాటలను కంపోజ్ చేసిన కూడా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో సక్సెస్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రత్యేకంగా లిరికల్ సాంగ్స్ షూట్ చేసి విడుదల చేస్తుండటం మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పాటలో సితార కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ఈ పాటను జనాలు ఎక్కువసార్లు చూస్తున్నారు. ఇక మే 12వ తేదీన విడుదల కాబోతున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Mahesh babu Sarkaru vaari paata Penny song creates new record in tollywood,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X