SVP Penny Song: మహేష్ క్యారెక్టర్ ఏమిటో చెప్పేసిన స్టైలిష్ సాంగ్.. థమన్, సితార సర్‌‌ప్రైజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొదటి పాట కళావతి ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇక అప్పుడే చిత్ర యూనిట్ సభ్యులు మరొక పాటను విడుదల చేయడం విశేషం.

సినిమా విడుదల డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇక పెన్నీ అనే పాటను విడుదల చేయడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ పాటతో సినిమాలో మహేష్ క్యారెక్టర్ గురించి క్లారిటీగా అర్థమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

సాంగ్ లో సితార

సాంగ్ లో సితార

ఇక పెన్నీ పాటలో మహేష్ బాబు కూతురు సితార కూడా ప్రత్యేక ఆకర్షణగా స్టెప్పులతో అలరించడం విశేషం. అలాగే సంగీత దర్శకుడు థమన్ గాయకుడు నకాశ్ అజీజ్ కూడా స్టెప్పులు వేస్తూ ఆకర్షించారు. అనంత శ్రీరామ్ రాసిన పెన్నీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు క్యారెక్టర్ ను సినిమాలో హైలెట్ చేసే విధంగా ఈ పాటను రచించినట్లు తెలుస్తోంది.

 మహేష్ క్యారెక్టర్..

మహేష్ క్యారెక్టర్..

మహేష్ బాబు ఈ సినిమాలో ఒక బ్యాంకు కు సంబంధించిన రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ముందుగానే సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ పాట ద్వారా అతని క్యారెక్టర్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. బిల్ గేట్స్ అయినా బైడేన్ అయినా ఎవరైనా సరే తీసుకున్న అప్పు తిరిగి కట్టాల్సిందే అన్న తరహాలో రిలిక్స్ రాయడం చూస్తుంటే సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉందనిపిస్తోంది.

థమన్ కూడా

ఇక పాట లో మొదటిసారి కనిపించిన సితార తన స్టైలిష్ స్టెప్పులతో ఎంతగానో ఆకట్టుకుంది. మొన్నటివరకు ఇన్స్టాగ్రామ్లో ఏదో సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన సితారా ఇప్పుడు ఊహించని విధంగా మహేష్ బాబు సినిమా లోనే డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. సితార ఎంట్రీతో ఈ పాటకు సరికొత్త అందం వచ్చింది అని చెప్పాలి. ఆమెతో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా స్టెప్పులు వేయడం విశేషం.

షూటింగ్ ఫినిష్ అయినట్లే..

షూటింగ్ ఫినిష్ అయినట్లే..

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే దాదాపు ఫినిషి అయ్యింది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయనున్నారు. మొత్తానికి రెండు పాటలతోనే సినిమాపై మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు గా ఈ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే సినిమా..

అంచనాలకు తగ్గట్టుగానే సినిమా..

ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు పరశురామ్ ఇది వరకే చాలాసార్లు సినిమాలో మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించబోతున్నట్లు చెప్పారు. సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు. సినిమా చివరిలో ఒక సందేశం కూడా అభిమానుల్లో ఒక మంచి ఫీలింగ్ కలిగిస్తుంది అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. మరి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X