Guntur kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్.. రిలీజ్ ముందే రచ్చ లేపేలా కొత్త సాంగ్

గుంటూరు కారం.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియాలోనూ, టీవీ చానెళ్లలోనూ మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ చాలా రోజులుగా ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది. దీంతో విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుంది.

'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గుంటూరు కారం' చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సుదీర్ఘ కాలంగా తెరకెక్కిస్తున్నారు. ఎలాగైనా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో పనులన్నీ ముగించుకుని ఫైనల్ కాపీని రెడీ చేసుకున్నారు.

Recommended Video

Mawaa Enthaina Song Review..పోటాపోటీగా Guntur Kaaram హనుమాన్ Bookings | Telugu Filmibeat

Mahesh Babu Starrer Guntur kaaram Movie Mawaa Enthaina Song Released

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో పాటు ప్రమోషన్‌ను కూడా ముమ్మరం చేసేశారు. ఇప్పటికే ఇప్పటికే దీని నుంచి టీజర్, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా వదిలారు. వీటికి భారీ రెస్పాన్స్ లభించింది.

మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాలోని మూడు పాటలను ఇటీవలే విడుదల చేశారు. వీటిలో ఒక దానికి భారీగా, మరో దానికి తక్కువ స్పందన వచ్చింది. దీంతో ఈ సారి ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే తాజాగా 'మావ ఎంతైనా' అనే సాంగ్‌ను వదిలారు.

'గుంటూరు కారం' మూవీ నుంచి తాజాగా 'మావ ఎంతైనా' అంటూ సాగే పాటను వదిలారు. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. దీన్ని శ్రీకృష్ణ, రామాచారి కలిసి ఆలపించారు. ఇందులో మహేశ్ బాబు స్టెప్స్ అదిరిపోయాయి. అలాగే, విజువల్స్, లిరిక్స్, కంపోజింగ్ కూడా అద్భుతంగా కుదిరింది. దీంతో ఈ పాట యమ వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. మహేశ్, త్రివిక్రమ్ కలిసి చేసిన 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X