Mahesh Babu: గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ లీక్.. ఫ్యాన్స్‌కు మసాలా బిర్యానీనే
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా క్రేజీ కాంబినేషన్‌లలో భారీ సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రం ఆరంభం నుంచే హైప్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటి వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో దాదాపు పదమూడేళ్ల తర్వాత రూపొందుతోన్న 'గుంటూరు కారం' ఒకటి.
'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'గుంటూరు కారం' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇలా దీన్ని సంక్రాంతి బరిలో నిలపబోతున్నారు.

'గుంటూరు కారం' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఒక్క గ్లింప్స్ వీడియో మాత్రమే విడుదలైంది. దీంతో దీని నుంచి అప్‌డేట్లను ఇవ్వాలని సూపర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ చాలా రోజులుగా చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, అవేమీ నిజం కాలేదు.
మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'గుంటూరు కారం' సినిమాలోని మొదటి పాటను కచ్చితంగా నవంబర్ మొదటి వారంలోనే విడుదల చేస్తామని ఇటీవలే ఓ ప్రెస్‌మీట్‌లో నాగ వంశీ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. కానీ, దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సారి కూడా పాట రావడం కష్టమే అని స్ఫష్టం అయిపోయింది.
'గుంటూరు కారం' మూవీలోని సాంగ్ రిలీజ్ ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోయింది. 'మసాలా బిర్యానీ' అంటూ సాగే ఓ పాట తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదే గుంటూరు కారం మూవీలోని పాట అని అంటున్నారు. ఇది థమన్ కంపోజ్ చేసినట్లే ఉండడంతో అంతా నిజమే అనుకుంటున్నారు.
ఇక, క్రేజీగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











