Guntur karam: మహేశ్ నుంచి అదిగో వస్తుంది.. ఫస్ట్ సర్‌ప్రైజ్‌కు డేట్ ఫిక్స్
ఆ మధ్య హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకుని కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపించి.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం గతంలో తనకు 'అతడ', 'ఖలేజా' వంటి రెండు సక్సెస్‌లను ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో షూట్ సజావుగా సాగలేదు. ఒక దశలో ఈ చిత్రం ఆగిపోతుందేమో అని అంతా అనుకున్నారు. ఫలితంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నో బ్రేకుల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మళ్లీ ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఎంతో వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 80 శాతం టాకీ పార్టు పూర్తి చేశారు. అలాగే, మిగిలిన భాగాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని.. మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కసిగా వర్క్ చేస్తోంది.
ఇక, 'గుంటూరు కారం' సినిమాలోని మొదటి పాటను దసరా సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, దీన్ని నవంబర్‌లోనే తీసుకు రాబోతున్నట్లు తర్వాత మరో వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'గుంటూరు కారం'లోని మొదటి పాటను అక్టోబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తారట. ఈ ప్రకటన ఈ రెండు రోజుల్లోనే రాబోతుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. క్రేజీగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రాబోతుంది.


Click it and Unblock the Notifications











