Guntur karam: 'మడతపెట్టి' సాంగ్ వింటే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పూనకాలే.. లిరిక్స్ అయితే నెక్ట్స్ లెవెల్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతుంది. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కుర్చి మడత పెట్టి పాట విడుదల అయింది. అంతా అనుకున్నట్లుగా ఈ పాటలో ఏమాత్రం బూతు లేదు. లిరిక్స్ తో పాటు పాట కూడా అదిరిపోయింది.

ది గ్రేట్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించారు. కుర్చి మడత పెట్టి డైలాగ్ బూతే అయినప్పటికీ.. పాటలో మాత్రం ఏమాత్రం బూతు కనిపించట్లేదు. రాజమండ్రి రాగ మంజరి.. మా యమ్మ పేరు తలవోనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకార్ల ఫ్యామిలీ మరి.. నే గజ్జ కడితే నిదురపోదు నిండు రాతిరీ అంటూ స్టార్ట్ కాగా.. శ్రీలీల వేసిన స్టెప్పులు అయితే అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక మిల్క్ బాయ్ మహేష్ బాబు మాస్ లుక్ లో యమా క్రేజీగా కనిపిస్తున్నాడు.

 Mahesh Babu Starrer Guntur karam Movie Kurchi Madathapetti Song Outnow Check Details

సోకులాడి స్వప్న సుందరి.. నీ మడత సూపు మాపటేల మల్లె పందిరి అంటూ వచ్చే లైన్ అయితే మరింతగా అదిరింది. రచ్చరాజుకుందే ఊపిరి.. నీ వెనక చూస్తే గుండెలోనూ డిరి డిరి డిర డిర అంటూ మరింత ఊపునిస్తోంది. ఇక ఆత ర్వాత డుర్ ఉహ్హూ.. డుర్ ఉహ్హూ అంటూ వచ్చే మ్యూజిక్ కు మహేశ్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్పులు చూస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. ఇంత హాట్ గా ఉన్న ఈ పాటలో ఎలాంటి బూతు పదాలు లేవు. చాలా అద్భుతంగా ఉంది. కుర్చి మడత పెట్టి డైలాగ్ అయితే ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.

 Mahesh Babu Starrer Guntur karam Movie Kurchi Madathapetti Song Outnow Check Details

ఇప్పటి వరకు విడుదల అయిన పాటలు, సినిమా పోస్టర్లు, టీజర్లు ఒక లెవెల్ అయితే ఈ కుర్చీ మడత పెట్టి అంటూ వచ్చేసిన మాస్ సాంగ్ మరో లెవెల్ అంతే. ఈ సినిమాను నెక్స్ట్ స్టేజీకి తీసుకెళ్లేందుకు ఈ పాట చాలా ప్లస్ అవుతుందని పాట చూస్తుంటేనే తెలుస్తోంది. మీరూ ఓసారి ఓ అదిరిపోయిన సాంగ్ ను వినేయండి. అలాగే మహేష్ బాబు మాస్ లుక్స్ చూసి మస్తుగా ఎంజాయ్ చేసేయండి. ఇక శ్రీలీల అదిరిపోయే స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఓసారి ఈ స్పెషల్ సాంగ్ ను చూడండి. అంతా అర్థం అవుతుంది.

మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరిల కాంబోలో రాబోతున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకోబోతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X