Guntur karam: కుర్చి మడతపెట్టి అంటున్న మహేశ్.. ఇది కదా అసలైన సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో పక్కా కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుని.. వరుసగా జనరంజకమైన సినిమాలు చేస్తూ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా ఫలితాలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న అతడు.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో 'గుంటూరు కారం' అనే మూవీని చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. 'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సుదీర్ఘ కాలంగా తెరకెక్కిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video


మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ 2021లోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో దీనికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులుగా దీన్ని శరవేగంగా జరుపుతూ తాజాగా పూర్తి చేశారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా స్పీడుగా జరుపుతున్నారు.
మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాలోని రెండు పాటలను ఇటీవలే విడుదల చేశారు. వీటిలో ఒక దానికి భారీగా, మరో దానికి తక్కువ స్పందన వచ్చింది. దీంతో ఈ సారి ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే తాజాగా మసాలా సాంగ్‌పై ప్రకటన వదిలింది.
'గుంటూరు కారం' మూవీ నుంచి 'కుర్చి మడతపెట్టి' అంటూ సాగే పాటను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమోను కూడా వదిలింది. ఇందులో మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్‌తో అలరించారు. ఫలితంగా ఈ పాటపై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











