Guntur karam: మహేశ్‌కు ముద్దు పెట్టిన శ్రీలీల.. మరో సర్‌ప్రైజ్‌కు డేట్ ఫిక్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో పక్కా కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుని వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్నాడు.
'అతడు', 'ఖలేజా' వంటి రెండు సక్సెస్‌లను ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న సినిమానే 'గుంటూరు కారం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో షూట్ సజావుగా సాగలేదు. ఒక దశలో ఈ చిత్రం ఆగిపోతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దీన్ని శరవేగంగా జరుపుతూ వస్తున్నారు.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాలోని మొదటి పాటను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా రెండో పాటపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది.
'గుంటూరు కారం' మూవీ నుంచి 'ఓ మై బేబీ' అంటూ సాగే రెండో పాటను డిసెంబర్ 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇందులో మహేశ్ బాబుకు శ్రీలీల ముద్దు పెడుతూ కనిపించింది. ఇక, ఈ పాటకు సంబంధించిన ప్రోమో డిసెంబర్ 11 సాయంత్ర 4:.05 గంటలకు రాబోతుందని తెలిపింది.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











