Guntur Kaaram Song: తమన్ మళ్లీ ఇలా దొరికేశాడు ఏంటి? ఆ సూపర్ హిట్ సాంగ్ దించేశాడుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ తమన్ ఒకరని చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు తమన్. అయితే తమన్ ఏదైనా పాట రిలీజ్ చేస్తే అతనిపై ట్రోలింగ్ వస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ సాంగ్ విషయంలో కూడా తమన్ కాపీ కొట్టాడంటూ ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ తమన్ ఒకరని చెప్పుకోవచ్చు. దశాబ్దకాలంగా తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు తమన్. స్టార్ హీరోలకు సూపర్ హిట్ అల్బామ్స్ ఇస్తూ.. క్రేజ్, పాపులారిటీ కొట్టేశాడు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన.. తమన్ పేరు ఉండేది. అంతే కాదు.. అల వైకుంఠపురములో లాంటి ఆల్‌టైమ్ బ్లాక్‌ బస్టర్ సాంగ్స్ కు ఆయనకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా కూడా అవార్డు వచ్చింది.

Mahesh Babu Trivikram Guntur Karam Second Single Tune Copy From Butta Bomma Song By Thaman Full Detailsh Here

తమన్ కొన్ని సార్లు తన పాటలని తానే కాపీ చేసుకుంటూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. మొదట్లో తమన్ వేరే వాళ్ల పాటలు కొట్టాడు అంటూ ఆరోపణలు రాగా.. ఆ తర్వాత ఆయన సొంత ట్యూన్ కాపీ కొట్టారంటూ ప్రచారం జరిగింది. చాలా సార్లు తమన్.. తన పాటలను తానే కాపీ చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా తమన్ మరోసారి అడ్డంగా దొరికేశాడంటూ ట్రోలింగ్ జరుగుతంది. తమన్ మరోసారి తన పాటనే కాపీ కొట్టాడని ఆరోపణలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మెళ్లిగా గుంటురు కారాన్ని ప్రేక్షకులకు రుద్దే ప్రయత్నంలో నేడు రెండో పాట ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

Mahesh Babu Trivikram Guntur Karam Second Single Tune Copy From Butta Bomma Song By Thaman Full Detailsh Here

గుంటూరు కారం నుంచి రెండో పాట 'ఓ మై బేబీ' అంటూ ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ మెలోడి సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా...రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఓ మై బేబీ అంటూ సాగే ఈ పాటను శిల్పారావు పాడారు. ఇక ఈ సాంగ్ వినసొంపుగా ఉందని తెలుస్తోంది. హీరో మహేశ్, హీరోయిన్ శ్రీలీల మధ్య రొమాంటిక్ గా ఉంటుందని తెలుస్తోంది. ఓ మై బేబి అంటూ కాస్త హమ్మింగ్ వస్తూ.. పాట ముగుస్తుంది.

అయితే ఓ మై బేబీ అంటూ హమ్మింగ్ వింటుంటే ప్రేక్షకులకు మరో సాంగ్ గుర్తుకు వస్తుంది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ బుట్టబొమ్మ స్లో బీట్ లాగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ మళ్లీ తన సినిమాలోనే ట్యూన్ లేపేశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి మళ్లీ తమన్ పై ట్రోలింగ్ మొదలు అయింది. ఈ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X