రంగ్ దే కోసం మహేష్ బాబు.. అదిరిపోయేలా సెట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్
ప్రస్తుతం రంగ్ దే ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. నితిన్ చెక్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరింత జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే రంగ్ దే సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. అయితే తాజాగా అసలు సిసలు అప్డేట్‌ను వదిలారు. దేవీ శ్రీ ప్రసాద్ రంగ్ దే కోసం కొడుతున్న ట్యూన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ విషయం ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు వింటేనేఅర్థమవుతుంది. అయితే తాజాగా మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించనున్నాడు. దేవీ సంగీత సారథ్యంలో సిధ్ శ్రీరామ్ మొదటిసారిగా పాట పాడుతున్నాడు. అది కూడా ఓ మెలోడీ గీతానికి. అందులోనూ ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతోన్నాడు. ఇక ఈ పాటకు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను కూడా వదిలారు.

నా కనులు ఎప్పుడూ అంటూ సాగే ఈ పాటను మార్చి 4న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కీర్తి సురేష్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్, సిధ్ శ్రీరామ్ కలిసి మొదటిసారిగా రాబోతోన్నారంటూ ఆసక్తిని రేకెత్తించింది. మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించాడు.


Click it and Unblock the Notifications











