అరుదైన మైలురాయిని చేరుకున్న మహేశ్: ఏకంగా పది కోట్లతో ‘మైండ్ బ్లాక్’ చేశాడు

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆరంభం నుంచే హిట్ టాక్ దక్కడంతో పాటు కలెక్షన్ల పరంగానూ భారీ స్పందన వచ్చింది. ఫలితంగా వంద కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లను రాబట్టింది. తద్వారా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించి.. మహేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.

బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

'సరిలేరు నీకెవ్వరు' మూవీకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని పాటలకూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని 'మైండ్ బ్లాక్' అంటూ సాగే ఫాస్ట్ బీట్‌కు ఊహించని స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబు.. రష్మిక మందన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ చాలా రోజుల పాటు ట్రెండింగ్ అయింది. ఇక, తాజాగా ఈ పాట వంద మిలియన్ల మైలురాయిని చేరుకుంది. అంటే అక్షరాలా పది కోట్ల వ్యూస్ అన్న మాట.

Maheshs Sarileru Neekevvaru Mind Block Full Video Song Reach 100 M

మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఇందులో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X