మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మరణంపై బలమైన అనుమానాలు… చక్రి తమ్ముడు సంచలన ఆరోపణలు

టాలీవుడ్ లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి చక్రి. పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిని అతను అందుకున్నాడు. అయితే అతను చనిపోకుండా ఉంటే ఇప్పుడు సౌత్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవాడు అనే మాట చాలా మంది చెబుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే చక్రి మరణం తర్వాత అతని తమ్ముడు మోహిత్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలతో తన ప్రయాణం సాగిస్తున్నారు. లవ్ యు బంగారం, రామప్ప, పరారి, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం అనే సినిమాలకి మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే తాజాగా యుట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తన అన్న చక్రి మరణంపై మోహిత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన అన్నయ్య చనిపోయే ముందు రోజు రాత్రి తన దగ్గరకి వచ్చి వెళ్ళారని, తెల్లారేసరికి మరణ వార్త విన్నామని తెలిపారు. ఇప్పటికి అన్నయ్య మరణంపై తమకి అనుమానంగానే ఉందని అన్నారు. మరణించిన వ్యక్తికి ఎందుకు పోస్ట్ మార్టం చేయడానికి భయపడ్డారు అంటే ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది అని భావిస్తున్నాం అని మోహిత్ అన్నారు.

Mahit Narayan sensational comments on music director chakri death

అలాగే అన్నయ్యకి మా అమ్మ విషం ఇచ్చింది అని పోలీసులకి ఫిర్యాదు చేశారని, తల్లి ఏ కొడుకుని అయిన చంపుకుంటుందా అని ప్రశ్నించారు. ఇక అన్నయ్య మరణంతర్వాత అతని స్టూడియో నాకు రాలేదని, తెలిపారు. అలాగే అన్న చనిపోయిన తర్వాత అతని భార్య ఆస్తులు అన్ని అమ్ముకొని అమెరికా వెళ్లి వేరొకరిని పెళ్లి చేసుకుందని మోహిత్ పేర్కొన్నారు. ఆమె అన్నయ్య గుర్తులు ఏమీ లేకుండా నాశనం చేసిందని మోహిత్ భావోద్వేగానికి గురయ్యారు.

అలాగే తమపైన అనవసరమైన కేసులు పెట్టి బాధించారని అన్నారు. అన్నయ్య పాటలు వచ్చిన ప్రతి సారి అమ్మ ఏడుస్తూ ఉంటుందని, ఇప్పటికి ఆ జ్ఞాపకాల నుంచి అమ్మ బయటకి రాలేదని మొహిత్ పేర్కొన్నారు. ఇక తాను ఇప్పుడిప్పుడే స్టూడియో కట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నా అని తన కెరియర్ గురించి కూడా మోహిత్ నారాయణన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X