Hrudayama Lyrical: మేజర్‌కు మహేశ్ సహాయం.. వ్యక్తిగతంగా ఇష్టమంటూ స్టార్ హీరో ట్వీట్

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఇప్పుడు టాలీవుడ్‌లోనే టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు విలక్షణ నటుడు అడివి శేష్. విభిన్నమైన చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపును అందుకున్న అతడు.. వరుసగా ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ జోష్‌లోనే ప్రస్తుతం అతడు 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మేజర్'. టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. దీంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Major Movie Hrudayama Lyrical Song Released

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'మేజర్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అయితే, మధ్యలో వరుసగా రెండేళ్లు కరోనా లాక్‌డౌన్ రూపంలో ఆటంకాలు ఏర్పడడంతో షూటింగ్‌కు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ముంబైలో ఓ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వెంటనే ప్రారంభించారు. దీంతో ప్రమోషన్‌ను కూడా షురూ చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మేజర్' మూవీని ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'హృదయమా' అంటూ సాగే పాటను విడుదల చేశారు. తాజాగా దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన మహేశ్ బాబు 'వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టమైన పాట' అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్, వీఎన్‌వీ రమేశ్ కుమార్ కలిసి లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి ఆలపించాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ మెలోడీగా వచ్చిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అలాగే, ఇందులో విజువల్స్ కూడా బాగున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మేజర్' మూవీ కోసం అడివి శేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ఈ సినిమాకు అతడు కథా సహకారం కూడా అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X