Bramayugam చరిత్రలో కనీవినీ ఎరుగని స్టోరితో భ్రమయుగం.. మమ్ముట్టీ ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భ్రమయుగం. ఈ సినిమాకు రాహులు సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అసలు కథ ఏమిటి? అనే విషయాల్లోకి వెళితే..
భ్రమయుగం సినిమాలో మమ్ముట్టితోపాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్డా లిజ్, మణికందన్ ఆచారీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా కేరళలో మరుగున పడి.. బాహ్య ప్రపంచానికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ కథతో సదాశివన్ తెరకెక్కిస్తున్నారు.

భ్రమయుగం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆడియోను రిలీజ్ చేశారు. తెలుగు భాషకు సంబంధించిన పాటలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ చిత్రంలో కుంజమోన్ పొట్టి, పున్నాగ పూతోట, ఈ మహా లోకాన, సూరీడే లేకుంటే.. ది బిగినింగ్, ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్ అనే పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

ఇక భ్రమయుగం సినిమాను దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళం, మలయాళం భాషల్లో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాల వేగం పెంచారు. ఈ ప్రచార చిత్రాలకు, కంటెంట్ ప్రేక్షకుల ఆసక్తిని, అంచనాలను పెంచుతున్నది. ఈ చిత్రంలో మమ్ముట్టి ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని పేర్కొంటున్నారు.

నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్డా లిజ్, మణికందన్ ఆచారీ తదితరులు
కథ, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
నిర్మాత: చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్
సినిమాటోగ్రఫి: షెహనాద్ జలాల్
ఎడిటింగ్: షాఫిక్ మహ్మద్ ఆలీ
మ్యూజిక్: క్రిస్టో జేవియర్
బ్యానర్: నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-02-15


Click it and Unblock the Notifications











