గోపీ సుందర్-సిద్ శ్రీరామ్ కాంబో.. రెడీ అవుతోన్న బ్యాచ్‌లర్ ఫస్ట్ సింగిల్
గోపీ సుందర్, సిద్ శ్రీరామ్ కాంబో అంటే అందరికీ టక్కున గీత గోవిందం సినిమా గుర్తుకు వస్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఇంకేం ఇంకేం కావాలె.. అనే పాట మదిలోకి వస్తుంది. ఈ ఇద్దరి కాంబోకు అంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిన పాట అది. మళ్లీ ఈ ఇద్దరు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం కలిశారు. బ్యాచ్‌లర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు.
ఎంతో కాలం నుంచి సక్సెస్ లేక సతమవుతున్న బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని బ్యాచ్‌లర్ చిత్రంపైనా ఆశలు పెట్టుకున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఫస్ట్ లుక్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్రయూనిట్‌లో కొత్త ఉత్సాహం నిండినట్టు తెలుస్తోంది. వరుసగా ఏదో ఒక అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ను ఇచ్చేశారు. ఈ సినిమాలోని మొదటి పాటను మార్చి 2న ఉదయం 10.45గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











