twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాపై పోరాటం.. ‘అంతా బాగుంటామ్‌రా’ అంటోన్న మనోజ్

    |

    ప్రపంచమంతా కరోనా బారిన పడింది. లక్షల మంది ఈ వైరస్‌కు బలైపోతోన్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుక, ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడేందుకు వైద్యులు, వైద్య బృందం, పారిశుద్ద్య కార్మికులు, పోలీలుసు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నారు. వీరి శ్రమను గుర్తించి గౌరవించేందుకు ఎంతో మంది కవులు, రచయితలు ముందుకు వస్తున్నారు. తమ కలానికి పదును పెట్టి వారి సేవలను కొనియాడుతున్నారు.

    ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముందడుగు వేశాడు. కరోనాపై నిర్విరామంగా పోరాడుతున్న వారందరి కోసం ఓ పాటను అంకితం చేస్తానని గత వారం ఓ ప్రకటన చేశాడు. 'వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు మ్యూజిక్ డైరెక్షన్లో "అంతా బాగుంటాంరా" అని నేను, నా మేనకొడలు విద్యా నిర్వాణ కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది. ఇప్పటికే చాలా వాటికోసం ఎదురు చూస్తున్నారు. కష్టం అయినా వచ్చే వారం వరకూ అగండ'ని ట్వీట్ చేశాడు.

    Manchu Manoj Antha Baaguntam Ra Song Released

    చెప్పినట్టుగానే నేడు ఆ పాటను రిలీజ్ చేశాడు. 'మన అందరినీ కాపాడేందుకు నిరంతరం పని చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు, మిగతా అందరికీ ఈ పాట నివాళిగా అర్పిస్తున్నాను. నా స్నేహితుడు అచ్చు.. స్వరపరిచిన ఈ పాటను నేను నా మేనకోడలు విద్య కలిసి ఆలపించామ'ని పాటను షేర్ చేశాడు.

    Recommended Video

    Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event

    English summary
    Manchu Manoj Antha Baaguntam Ra Song Released. Here is a tribute to all the police, doctors and municipal staff who are working round the clock to keep us safe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X