»   » మణిరత్నం చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ పాట

మణిరత్నం చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ పాట

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 'లవ్ అంటే నేనేలే' సాంగ్ ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు.

  అనగనగా ఓ ప్రేమకథ చిత్ర యూనిట్‌కు మణిరత్నం అభినందనలు తెలిపారు. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. తమ చిత్రంలోని లవ్ అంటే నేనేలే పాటను విడుదల చేయటం పట్ల జీనియస్ దర్శకుడు మణిరత్నంకు చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  Mani Ratnam launched a Anaganaga O Prema Katha song

  ఈ ఫీల్‌గుడ్ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

  Mani Ratnam launched a Anaganaga O Prema Katha song

  ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ

  నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
  కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

  English summary
  Our Production house Thousand lights Media Pvt Ltd is happy to announce that Legendary Director of Indian Cinema " Mani Ratnam " launched a song titled "love ante nenele " from our film "Anaganaga O Prema Katha" produced by K L N Raju , presented by K. Satish Kumar and directed by Pratap Tatamsetti . Genius director mani ratnam known for his excellence in move making has launched a Telugu song for the first time ever and congratulated entire team for the success of the film . We are honoured Maniratnam has launched our movie song , this itself indicates the success of our film , As a small film with new comers, getting a good response from entire film industry is making us happy . Producer K L N Raju specially thanked mani ratanam garu for the song launching.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more