Ponniyin Selvan 2: ఆగనందే అంటూ.. మరో అద్భుతమైన పాటతో వచ్చిన రెహమాన్.. హార్ట్ టచింగ్ సాంగ్!
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మొదటి పార్ట్ PS 1 తమిళనాడులో అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంది. అలాగే మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. PS 1లో అద్భుతమైన పాటలతో అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన రెహమాన్ ఈసారి సెకండ్ పార్ట్ లో కూడా అదే తరహాలో సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఆగనందే అనే మరొక పాటను కూడా విడుదల చేశారు.

ఇక ఈ మెలోడీ లవ్లీ సాంగ్ ను ప్రముఖ సింగర్ శక్తి శ్రీ గోపాలన్ పాడగా తెలుగు రచయిత అనంత శ్రీరామ్ అనువదించారు. రెహమాన్ మణిరత్నం కాంబినేషన్ కు ఏ స్థాయిలో గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా ఆకట్టుకుంటుంది అని అందరిలో ఒక నమ్మకం అయితే ఉంది.
ఇక ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రెహమాన్.. మణిరత్నం టేస్ట్ కు తగ్గట్టుగా ఆగనందే పాటను కంపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక త్రిష, కార్తీ క్యారెక్టర్జ్ మధ్యలో వచ్చే ఈ పాట సినిమాలో కూడా చాలా హైలెట్ గా నిలుస్తుందట. విడుదలైన కొన్ని గంటల్లోనే అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ పాట మేకింగ్ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం.
ఇక PS 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక మద్రాస్ టాకీస్ పై మణిరత్నంతోపాటు లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తప్పకుండా సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఈజీగా 500 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











