2 కోట్లు డిమాండ్.. 60 లక్షలకు సెట్.. ఇళయరాజా వివాదానికి హిట్ సినిమా నిర్మాతలు చెక్!
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సంగీత ప్రపంచంలోనే బ్రతుకుతారు. చేసే చిన్న పనిలో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతలా సంగీతం అనేది అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. మరి మన ఇండియాలో కూడా సినిమా దగ్గర సంగీతం అనేది చాలా ముఖ్యం. ఇతర దేశాల్లో సినిమాల్లో పెద్దగా పాటలు లాంటివి ఉండవు కానీ మన సినిమాల్లో అయితే పాటలు అనేవి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నాయి.
మరి ఇండియన్ సినిమా దగ్గర తన సంగీతంతో ఎన్నో ఏళ్ళు మైమరపించి ఇప్పటికీ ఉన్న ప్రస్తుత జెనరేషన్ ని తన పాటలతో ఆలోచింపజేసే సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మాస్ట్రో ఇళయరాజా అనే చెప్పాలి. ఇళయరాజా కెరీర్ లో ఇచ్చిన ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో చార్ట్ బస్టర్ లు ఆణిముత్యాల్లాంటి పాటలు ఉన్నాయి.

తాను అందించిన పాటలు అంత పెద్ద క్లాసిక్స్ కాబట్టే అప్పుడు కుర్రాళ్ళు ఇప్పటి నాన్నలు వాళ్ళ కొడుకులు కూడా ఇప్పటికీ వింటున్నారు. కాగా రాజా గారు ఇచ్చిన పాటలు కానీ నేపథ్య సంగీతాలు కానీ ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. అయితే తన ట్యూన్స్ పట్ల ఇళయరాజా చాలా పర్టిక్యులర్ గా ఉంటారని తెలిసిందే. అలా ఈ మధ్యనే తన అనుమతి లేకుండా తన సినిమా పాటలు వాడుకున్నారని కొన్ని సినిమాల యూనిట్స్ కి నోటీసులు పంపి తనకి జరిమానా కింద భారీ మొత్తంలో అడిగారు.
మరి ఈ చిత్రాల్లో రీసెంట్ మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా "మంజుమ్మల్ బాయ్స్" కూడా ఒకటి. కాగా తెలుగులో కూడా ఈ సినిమా భారీ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో ఇళయరాజా, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "గుణ" నుంచి 'కణ్మణి' సాంగ్ ని మంజుమ్మల్ బాయ్స్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో వాడుకున్నారు.
అయితే ఇంకా తెలుగులో రిలీజ్ కాక ముందే మలయాళంలో అదరగొడుతున్న సమయంలోనే కమల్ హాసన్ సైతం తన సాంగ్ కోసం తెలుసుకొని చిత్ర యూనిట్ ని అభినందించారు. కానీ ఇళయరాజా మాత్రం మరోలా ఆలోచించారు. తన అనుమతి లేకుండా తన ట్యూన్ ని మరో సినిమాలో ఎలా పెడతారు అంటూ తనకి 2 కోట్ల జరిమానా కట్టాలని చిత్ర యూనిట్ కి నోటీసులు పంపారు.

కాగా అప్పట్లో తాము సాంగ్ తాలూకా హక్కులు ఆ ఆడియో లేబుల్ నుంచి కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు కానీ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ నేను నా అనుమతి తప్పనిసరిగా ఉండాలని రాజా జీ చెబుతున్న మాట అన్నట్టు వినిపించింది. అయితే ఇళయరాజా ఎట్టి పరిస్థితిలో తనకి 2 కోట్లు కట్టాల్సిందే అని డిమాండ్ చేయగా నానా తంటాలు పడి మంజుమ్మల్ బాయ్స్ మేకర్స్ ఫైనల్ గా రాజా గారితో 60 లక్షలు ఇస్తామని సెటిల్ చేసుకున్నారట.
సో మొత్తానికి ఈ కాంట్రవర్సీ 2 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 60 లక్షలతో ముగిసింది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం కూడా ఇళయరాజా మంచి ట్యూన్స్ ని అందిస్తున్నారు. గత ఏడాది తెలుగు చిత్రం "రంగమార్తాండ" కి తన అద్భుతమైన వర్క్ ని అందించగా తమిళ్ లో విడుదలై చిత్రానికి ట్యూన్స్ అందించారు. ఈ ఏడాది తాను స్వరపరిచిన విడుదలై 2 రాబోతుంది. ఈ చిత్రం తెలుగులో కూడా 'విడుదల' కానుంది.


Click it and Unblock the Notifications











