Bhagavanth Kesari: బాలయ్య సినిమా నుంచి మరో లీక్.. ఆ హిట్ మూవీ రేంజ్‌లోనే!

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఇటీవలి కాలంలో ఆయన వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.

ఈ ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య.. అనిల్ రావిపూడితో కలిసి 'భగవంత్ కేసరి' అనే మూవీని చేస్తోన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

 Bhagavanth Kesari Movie

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం చిత్రీకరణ శరవేగంగానే సాగుతోంది.

ఇలా ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరా బరిలో నిలపబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో యమా వైరల్ అవుతోంది.

'భగవంత్ కేసరి' సినిమాలో ఎన్నో హైలైట్లు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ మ్యారేజ్ స్పెషల్ సాంగ్‌ను కూడా పెట్టారని తెలిసింది. ఇందులో బాలయ్యతో పాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల కూడా కనిపిస్తారని తెలుస్తోంది.

 Bhagavanth Kesari Movie

ఇటీవలే ఓ ప్రముఖ స్టూడియోలో ఈ పాటను షూట్ చేశారు. ఇది గతంలో బాలయ్య హిట్ మూవీ 'లక్ష్మీనరసింహా'లోని పెళ్లి పాటను మించేలా గ్రాండ్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ పాట నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం అని టాక్.

నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X