‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ప్రచార హోరు.. మార్వెల్ ఆంథెమ్ తెలుగు వెర్సన్ రిలీజ్!
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ వారితో కలిసి ఇండియాలో 'అవేంజర్స్ ఎండ్ గేమ్' మూవీ ప్రమోషన్ కోసం స్పెషల్ సాంగ్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ హిందీలో విడుదల చేయగా... తాజాగా టాలీవుడ్ అభిమానుల కోసం తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు.
''అంతులేని ఆ అంతరిక్షమే దాటి.. శూన్యంలో కనిపించే ఆ గ్యమం. లోకమున్ననూ లేకపోయిననూ నాపైనా.. భయమే దాటి బదులే చెప్పేదీ సమయం.. ఆగేది లేదు ఎదరు అడ్డేమున్నా'' అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్ మార్వెల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సాంగుకు రాకెండు మౌళి వెన్నెల కంటి లిరిక్స్ అందించగా, ఏఆర్ రెహమాన్ స్వయంగా కంపోజ్ చేసి పాడారు.
'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రానికి ఆంటోనీ, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియాలో హాలీవుడ్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉండటంతో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే దర్శకుల్లో ఒకరైన జో రుస్సో ఇండియాలో పర్యటించారు.

ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ ఇండియాలో భారీ విజయం అందుకుంది. దానికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ కావడంతో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' మూవీపై అంచనాలు ఆకాన్నంటాయి.


Click it and Unblock the Notifications











