రేపే ‘మాస్ బిర్యానీ’.. ప్రమోషన్ జోరు పెంచిన క్రాక్ టీం
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం జోరు మీదున్నాడు. క్రాక్ సినిమా చుట్టూ మొత్తం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. క్రాక్ నుంచి విడుదల చేసిన ప్రతీ ఒక్కటీ సెన్సేషనల్ అవుతోంది. టీజర్లు, పోస్టర్లు, పాటలు ఇలా ప్రతీఒక్కటీ వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అయితే సోషల్ మీడియాను ఊపేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ ఊపులోనే మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
క్రాక్ ట్రైలర్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. పది మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసి రవితేజ కెరీర్‌లో క్రాక్ ట్రైలర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇంకా దూసుకుపోతూనే ఉంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో క్రాక్ టీం ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేస్తోంది. జనవరి 9న క్రాక్‌ను విడుదల చేస్తోన్నట్టు ప్రకటించేసింది. ఈ క్రమంలోనే మరో మాస్ నెంబర్‌ను వదిలేందుకు రెడీ అయింది.

ఇప్పటికే భూం బద్దల్, కోరమీసం పోలీసోడా అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక తాజాగా మాస్ బిరియానీ అంటూ మరో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. రేపు (జనవరి 4) సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతి పోరుకు క్రాక్ బాట వేసినట్టు కనిపిస్తోంది. క్రాక్ సినిమా బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు అన్ని రకాలు సిద్దమైనట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











