NBK108: బాలయ్య సినిమాలో ఊహించని ట్రీట్.. పూనకాలు కంటే భారీగానే!
రెండేళ్ల క్రితం వచ్చిన 'అఖండ' మూవీ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకపోతోన్నారు సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి భారీ హిట్ అయింది. దీంతో బాలయ్యలో ఉత్సాహం రెట్టింపు అయిపోయిందని చెప్పొచ్చు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న మరణం కారణంగా బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో దీనికి కాస్త విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ షూట్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఒకటి హల్చల్ అవుతోంది.

బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఎన్నో హైలైట్లు ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే లీకులు ఇచ్చేశాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ సూపర్ మాస్ సాంగ్‌ను కూడా పెట్టారని తెలిసింది. రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. ఈ పాటను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఇక, 'వాల్తేరు వీరయ్య'లో పూనకాలు లోడింగ్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించేలా తీశారని తెలిసింది. ఈ సాంగ్ సినిమా ప్రీ క్లైమాక్స్‌కు ముందు వస్తుందని, ఆ సమయంలో థియేటర్లు ఊగిపోవడం ఖాయమని తెలిసింది.
నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది దసరాకు విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











