ఆచార్య నుంచి మరో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్ మాస్ లుక్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నుంచి ఎంతగానో ఊరిస్తున్న ఈ సినిమా మొత్తానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అంతకుముందే పొంగల్ ఫెస్టివల్ ను కొత్త సినిమాలు బుక్ చేసుకోవడంతో ఆచార్యను వాయిదా వేసుకోక తప్పలేదు. ఏదేమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడు అని అనిపిస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక మంచి సందేశం ఉండేలా అందరినీ ఆకట్టుకుంటారు.

సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా సిద్ధా అనే ఒక నక్సలైట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటిసారి రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ తో పూర్తిస్థాయిలో కథలో భాగంగా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే టీజర్ అయితే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. వెండితెరపై ఒక్కరు కనిపిస్తేనే ఊహలకందని రేంజ్ లో ఉంటుంది. ఇక ఇద్దరూ చిరుతపులి లాంటి హీరోలు కలిసి యాక్షన్ లోకి దిగితే ఆ సీన్స్ మామూలుగా ఉండవు. తప్పకుండా బాక్సాఫీస్ షేక్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన రెండు పాటలు కూడా యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Megastar chiranjeevi acharya movie 3rd single announcement

అంతేకాకుండా సినిమాపై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆచార్య సినిమా నుంచి మరో పాటను కూడా విడుదల చేయాలని చెబుతున్నారు. 'సానా కష్టం' అనే పాట లిరికల్ వీడియో ని జనవరి 3వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోయే ఆ పాట మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారితో చిందులు వేయిస్తుందని అంటున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి వేసే స్టేపులు కూడా అద్భుతంగా ఉంటాయట. ఇక చిత్ర యూనిట్ సభ్యులు సాంగ్ అప్డేట్ ఇస్తూ విడుదల చేసిన పోస్టర్ లో కూడా మెగాస్టార్ స్టిల్ అయితే మామూలుగా లేదని అభిమానులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాను ఇటీవల పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని అనుకున్నారట. కానీ మెగాస్టార్ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాను మొదట్లోనే పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా తెరకెక్కించినట్లు ఉందని అనవసరంగా మళ్ళీ వేరే మార్కెట్లోకి సినిమాను పంపి రిస్క్ చేయవద్దు అని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా ట్రైలర్ ను జనవరి 26న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X