Acharya: సానా కష్టం అంటూ.. స్టెప్పులతో మరోసారి మంచి కిక్కిచ్చిన మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి పాటకైనా సరే చాలా ఈజీగా స్టెప్పులు వేస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు పదుల వయసు వచ్చినా కూడా ఆయన పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే చాలా ఈజీగా డాన్స్ చేస్తూ ఉండడం అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఏళ్లు గడిచినా కూడా బాస్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి రుజువయింది. ఆచార్య సినిమాలో మంచి కమర్షియల్ అంశాలతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుందని టీజర్ తోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన పాటలతో మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేలా చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇక జనవరి 3వ తేదీన మరో పాటను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు పాటకు సంబంధించిన స్పెషల్ ప్రోమో ను కూడా విడుదల చేయగా అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సానా కష్టం.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో కిక్కిచ్చారు అని అభిమానులు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఏ వయసులో ఉన్న కూడా బాస్ మాత్రం ఇంకా అదే ఎనర్జీతో కనిపిస్తున్నారు అని స్టెప్పులు కూడా అదిరి పోయాయి అని చెబుతున్నారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను రేవంత్, గీతా మాధురి పాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు పాటలో స్పెషల్ గా పర్ఫామెన్స్ ఇచ్చిన రెజీనా కసాండ్రా కూడా తన ఘాటు అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించబోతోందనే చెప్పాలి. ప్రోమో సాంగ్ మాత్రమే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక ఫుల్ సాంగ్ వస్తే ఇంకా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చెప్పవచ్చు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోయే ఈ సినిమాపై ప్రస్తుతం చాలా పాజిటివ్ టాక్ అయితే ఉంది.

దర్శకుడు కొరటాల శివ ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ డోస్ పెంచాలని అనుకుంటున్నాడు. వీలైనంత త్వరగా సినిమా కు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మణిశర్మ అందించిన మూడు పాటలు కూడా సక్సెస్ అయినట్లు గా క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే లాహే లాహే లిరికల్ పాట 100 మిలియన్ వ్యూవ్స్ అందుకొని 2021 టాలీవుడ్ టాప్ 5 సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

Megastar chiranjeevi acharya new song promo

రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో సిద్ధ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన విషయం. ఇక మెగా అభిమానులకు ఈ సినిమా సరికొత్త ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక చిరు చరణ్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X