GodFather తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ సాంగ్ అదిరింది.. చిరు, సల్మాన్ ఫ్యాన్స్ కు పండగే!
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కోసం ఫాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలోని ఫస్ట్ సాంగ్ తార్ మార్ తక్కర్ మార్ అనే పాట గత కొన్ని రోజులుగా ఎంతగానో ఊరిస్తోంది. ఇంక మొత్తానికి నేడు లిరికల్ పాటను కూడా విడుదల చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ కు నచ్చేలా..
ఒకరు టాలీవుడ్ మెగాస్టార్ మరొకరు బాలీవుడ్ మెగాస్టార్. ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ అంచనాలు మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ పనులు మొత్తం కూడా ఫినిష్ అయ్యాయి. ఇక సినిమాను రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఫస్ట్ సాంగ్ కూడా అభిమానులకు నచ్చినట్లుగానే తమన్ కంపోజ్ చేశాడు.

స్టెప్పులు వేయించేలా..
మలయాళం లో మంచి సక్సెస్ అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కు నచ్చే విధంగానే ఉంటుంది అని ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి అప్డేట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఫాన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కూడా ఫ్యాన్స్ చేత డాన్స్ స్టెప్పులు వేయించేలా ఉంది.

ఉరమాస్.. స్టైలిష్ లుక్
అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ పాడారు. ఇక సినిమా లిరికల్ సాంగ్ విషయానికి వస్తే ఇద్దరూ మెగాస్టార్స్ కూడా ఉరమాస్ అండ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. ఇక ఇద్దరూ మెగా బాస్ లు రెచ్చిపోయి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ లోనే ఈ పాటను రాసినట్లుగా అర్థమవుతుంది. ఇక ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే అనే విధంగా కూడా లిరిక్స్ చాలా అద్భుతంగా రచించారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా..
తమన్ ఇచ్చిన మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. మొదట ఈ పాటపై కొన్ని కాఫీ అనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఫైనల్ సాంగ్ చూసిన తర్వాత మాత్రం అందరూ కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది అని వెండితెరపై ఇంకా ఊహించని రేంజ్ లో అదిరిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ సల్మాన్ ఖాన్ స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

గ్రాండ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గాడ్ ఫాదర్ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక హిందీలో కూడా ఈ పాటను విడుదల చేశారు. అసలైతే గత నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ వాయిదా పడడం అలాగే మరికొన్ని కారణాల వలన వాయిదా వేశారు. ఫైనల్ గా దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దాదాపు అన్ని పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక త్వరలోనే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.


Click it and Unblock the Notifications











